ఆన్‌లైన్‌.. ప్రతీక్షణం లక్షల పోస్టులు

Data Use World Wide More Than 2019 - Sakshi

2020 డేటా ఇయర్‌..

గతేడాది అనూహ్యంగా పెరిగిన డేటా వినియోగం

ప్రపంచ వ్యాప్తంగా 457 కోట్లకు చేరిన వినియోగదారులు

2019 జనవరితో పోలిస్తే ఇది 6% అధికం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావిత మయ్యాయి. అదేసమయంలో డేటా వినియోగం అనివార్యంగా మారింది. 2020 ఏప్రిల్‌ తరువాత.. కోవిడ్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఇంటర్నెట్‌ ఆధారిత సేవలను అనివార్యం చేసింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, ఆర్థిక, సామాజిక రంగాలన్నీ ఇంటర్నెట్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15%లోపు ప్రజలు వర్క్‌ఫ్రమ్‌ హోం చేసేవారు. కానీ, లాక్‌డౌన్‌ దెబ్బకు ఇది 50% దాటింది. ఇక రోజువారీ జీవితంలోనూ యాప్స్‌ వినియోగం అనూహ్యంగా పెరిగింది.

ఆన్‌ లైన్‌ కొనుగోళ్లు, నగదు చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, బుకింగ్స్, వినోదం, సందేశం, సంగీతం, సంప్రదింపులు, సమావేశాలు, శిక్షణ ఇలా ప్రతీది డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్‌ ఉంటుంది. మనకు పగలైతే, మరో దేశంలో రాత్రి. డేటా ఆధారిత సేవలు పెరిగిపోతుండటంతో మనుషులు నిద్రపోయినా.. డేటా మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ప్రతీ సెకనుకు అనేక లక్షల ఆర్డర్లు, క్లిక్స్, అప్‌లోడ్సే నిదర్శనం. లాక్‌డౌన్‌ తర్వాత డేటా వినియోగం ఎలా పెరిగిందో డోమో అనే అమెరికాకు చెందిన క్లౌడ్‌ సంస్థ అధ్యయనం చేసింది. డేటా నెవ ర్‌ స్లీప్స్‌ 8.0 పేరిట తన తాజా అధ్యయనం ఫలితాలను విడుదల చేసింది. 

ప్రతీ నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అప్‌లోడ్స్‌ 

జూమ్‌ మీటింగులు :  2,08,333 
ఫేస్‌బుక్‌ అప్‌లోడ్స్ ‌:  1,47,000 
వాట్సాప్‌ షేర్లు :  4,16,66,667 
మొబైల్‌ యాప్‌ల కోసం వెచ్చించిన మొత్తం : 3805 యూఎస్‌ డాలర్లు 
వీడియోకాల్స్ ‌: 13,88,889 
అమెజాన్‌ ఆర్డర్లు :  6,659 
ఇన్‌స్టాగ్రామ్‌   1,38,889 
స్పాటిఫై :   28 మ్యూజిక్‌ ట్రాకులు 
టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్ ‌:  2,704 
లింక్డ్‌ఇన్‌ దరఖాస్తులు :  69,444 
ఫేస్‌బుక్‌లో షేర్లు :  1,50,000 
మైక్రోసాఫ్ట్‌ టీమ్‌ వినియోగం : 52,083 
ఆన్‌లైన్‌లో వినియోగదారులు వెచ్చించిన మొత్తం :  10,00,000 అమెరికా డాలర్లు 
ట్విట్టర్‌ కొత్త వినియోగదారులు : 319 మంది 
యూట్యూబ్‌ అప్‌లోడ్స్‌ : 500 గంటలు 
ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు : 3,47,222 
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన వీడియోలు : 4,04,444 గంటలు 

457 కోట్లకు చేరిన వినియోగదారులు.. 
ఏటేటా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండగా...అదికాస్తా లాక్‌డౌన్‌తో మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 59% మంది అంటే 457 కోట్ల మంది డేటా ఆధారిత సేవలు పొందుతున్నారు. 2019 జనవరితో పోలిస్తే డేటా వినియోగంలో 6% వినియోగం పెరిగిందని ‘డోమో’తెలిపింది. 

సంవత్సరం డేటా 
వినియోగదారులు కోట్లలో
 
2014      300 కోట్లు 
2016      340 కోట్లు 
2018      430 కోట్లు 
2020      450 కోట్లు
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top