Indira Hridayesh Passed Away: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇందిరా హృదయేశ్‌ కన్నుమూత

Jun 14 2021 2:07 PM | Updated on Jun 14 2021 3:06 PM

Congress Leader Indira Hridayesh No More - Sakshi

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరా హృదయేశ్‌ ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఏప్రిల్‌లో కోవిడ్‌ బారిన పడిన ఆమె కోలుకున్నారు. తర్వాత ఆమె గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. శనివారం రాష్ట్ర పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె.. ఉత్తరాఖండ్‌ సదన్‌లో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు సుమిత్‌ హృదయేశ్‌ తెలిపారని ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ స్థానం నుంచి ఎన్నికైన ఇందిర, రాష్ట్ర కాంగ్రెస్‌ అంత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరు. ఆమె రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 2012-2017 సంవత్సరాల్లో పనిచేశారు. ఇందిర మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement