సంచలన నిర్ణయం..ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’ లాయర్‌ ! | Sakshi
Sakshi News home page

సంచలన నిర్ణయం..ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’ లాయర్‌ !

Published Mon, Nov 15 2021 11:27 PM

Collegium Recommends Elevation Of Saurabh Kirpal As Delhi High Court Judge - Sakshi

న్యూ ఢిల్లీ:  భారత అత్యున్నత న్యాయ స్థానం సంచలన నిర్ణ యం తీసుకుంది. సీనియర్‌ న్యాయవాది, గే అయిన సౌరభ్‌ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియం సిఫార్సును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్‌ వార్తలకెక్కనున్నారు.

ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీలో ‘లా’లో అండర్‌ అండర్‌గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ చేసిన సౌరభ్‌.. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి అని తెలుస్తోంది.   

Advertisement
Advertisement