సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా

Collegium recommends Bombay HC Chief Justice Dipankar Datta as Supreme Court judge - Sakshi

బాంబే హైకోర్టు సీజే పేరు సిఫార్సు చేసిన కొలీజియం

సాక్షి, న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ సహా 29 మంది న్యాయమూర్తులున్నారు. గరిష్ట సంఖ్య 34. కోల్‌కతాకు చెందిన జస్టిస్‌ దత్తా 1965లో జన్మించారు.

1989లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. పలు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేశారు. రాజ్యాంగపరమైన, సివిల్‌ కేసులు వాదించడంలో దిట్టగాపేరొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదిగా పనిచేశారు. 2006లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్‌ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్‌ సలీల్‌ కుమార్‌ దత్తా కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top