నేడు దేశవ్యాప్త నిరసనలు | CJP calls for nationwide protest on 24 july 2026 | Sakshi
Sakshi News home page

నేడు దేశవ్యాప్త నిరసనలు

Jul 24 2026 4:51 AM | Updated on Jul 24 2026 6:23 AM

CJP calls for nationwide protest on 24 july 2026

ప్రకటించిన సీజేపీ 

న్యూఢిల్లీ: నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ, మంత్రి ధర్మేంద్ర రాజీనామా విషయాల్లో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ సీజేపీ శుక్రవారం దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరపాలని ప్రజలను కోరింది. ‘ప్రతి జిల్లాలో ఒక రోజంతా ఒక్కటే డిమాండ్‌’పేరిట నిరసన ప్రదర్శనలు జరగాలని సీజేపీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ వ్యతిరేక నినదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రభుత్వం ఆ పరిసరాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలను మొహరించారు. పలు చోట్ల బ్యారీకేడ్లను పెట్టడంతో కన్నాట్‌ ప్లేస్‌ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. దీక్షాస్థలి వైపునకు రాకుండా కొత్త వాళ్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఉద్యమంతోసంబంధంలేని ‘బయటి వ్యక్తులు’, గూండాలను బీజేపీ ఇక్కడికి తరలిస్తోందని సీజేపీ ఆరోపించింది. 

పోలీస్‌ యూనిఫాం లేని కొందరు పోలీస్‌ బ్యాటన్లు పట్టుకుని విద్యార్థులను బెదిరిస్తున్న వీడియోను సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ సోషల్‌మీడియాలో విడుదలచేశారు. సమీప కన్నాట్‌ ప్లేస్‌లోని దుకాణదారులు గురువారం సాయంంత్రం ఆరున్నరకల్లా షాప్‌లు మూసేశారి న్యూఢిల్లీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ప్రతికూల వాతావరణంలోనూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు తమ సాయం ఎప్పుడూ ఉంటుందని జంతర్‌మంతర్‌ వద్ద జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు చెలరేగే ఆస్కారముందని, ముందుజాగ్రత్తగా 16 ఢిల్లీ మెట్రోస్టేషన్లను గంటల తరబడి అధికారులు మూసేశారు. 14 గంటల తర్వాత సాయంత్రం రాజీవ్‌ చౌక్, మండీ హౌస్, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ స్టేషన్లను మాత్రం తెరిచారు. అయితే శుక్రవారం అన్ని మెట్రో స్టేషన్లనూ మూసేస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ గురువారం జంతర్‌మంతర్‌ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ సేవలను ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా స్తంభింపజేసింది. జూలై 17వ తేదీ నుంచి ఇలా ఇంటర్నెట్‌ను నిలిపేయడం ఇది ఐదోసారి. 

వాళ్ల పోస్‌పోర్ట్‌లు రద్దు! 
రణరంగంగా మారిన జూలై 20నాటి పార్లమెంట్‌ ర్యాలీ ఉదంతంలో పాల్గొన్న నిరసనకారుల పాస్‌పోర్ట్‌లు రద్దయ్యే ప్రమాదముందని ఢిల్లీ పోలీస్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు ఛలో సంసద్‌ ర్యాలీలో క్రియాశీలంగా పాల్గొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని, పోలీసులపై దాడులుచేసిన వారిని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, భద్రతా బలగాల బాడీకామ్‌లు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా గుర్తించి వారి పాస్‌పోర్ట్‌లను రద్దుచేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement