షావుకార్ల కక్కుర్తి!

Civil Supplies Department Inquiry Ration Cards Of 12584 Car Owners Cut - Sakshi

బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్‌ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్‌ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే  ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను  ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది.   

బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్‌  చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది.

అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్‌ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది.  

కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య
కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ  రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా  సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్‌ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్‌కోటె  216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 

22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్‌ కార్డులు: 
మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్‌ఆర్‌ఎంఎస్‌)  ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యో­గులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్‌ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్‌ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.

జిల్లాల వారీగా రద్దైన కార్డులు
నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని  తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను  పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది.  వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్‌ 3,08,345  బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్‌ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది.    

(చదవండి: ప్రేమించలేదని  గొంతు కోసుకున్నాడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top