బాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!

From Child Labourer To Teacher A Delhi Man Inspiring Story - Sakshi

న్యూఢిల్లీ: అందరూ ఇంజనీర్లు.. డాక్టర్లు.. కలెక్టర్లు కాలేరు! ఏవేవో కారణాలతో మనం కన్నకలలు చెదిరిపోవచ్చు. దీంతో చాలామంది నిరాశ నిస్ప్రుహలకు లోనే జీవితాన్ని అంతం చేసేసుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తాము కన్న కలలు కల్లలైపోయిన వెరవక తాను కోల్పోయినట్లుగా మరెవ్వరూ కోల్పోకూడదని తపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే న్యూఢిల్లీకి చెందిన ఈ "పేరు తెలయని వ్యక్తి". ఆ పేరు తెలియని టీచర్‌ గురించి హ్యూమన్స్‌ఆఫ్‌ బాంబే  ఫేస్‌బుక్‌లో రావడంతో.. ప్రస్తుతం అతడి స్టోరీ వైరలవుతోంది. 

పేరు కూడా చెప్పడానికీ ఇష్టపడని ఈ ఢిల్లీవాసి తాను బాలకార్మికుడినని చెప్పాడు. అతనిది చాలా పెద్ద కుటుంబమని.. 8 మంది సంతానం, తండ్రి రైతు కూలి, సంపాదన రోజుకి రూ 50 మాత్రమే అన్నాడు. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండటంతో తాను కూడా పోలం పనులకు వెళ్లేవాడిని అన్నాడు. తన పనంతా పూర్తయ్యాక తమ ఊరికి 30 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకి వెళ్లేవాడినన్నాడు. తమ కుటుంబంలో హైస్కూల్‌ చదువును పూర్తి చేసిన వ్యక్తి తాను మాత్రమే అని తెలిపాడు.

మధ్యలో ఆగిపోయిన చదువు....
ఇంజనీరింగ్‌ చదవాలనేది సదరు వ్యక్తి కల. కాలేజ్‌లో అడ్మిషన్‌ కూడా సంపాదించుకున్నాడు. కానీ వాళ్ల నాన్నజబ్బుపడడంతో మధ్యలోనే వదిలేయవలసి వచ్చింది. డబ్బుల కోసం పుచ్చకాయలు అమ్మడం దగ్గర నుంచి చేయని పని అంటూ... లేదు. ఆఖరికి తీరిక వేలళ్లో కిరణా షాపుల్లో పనిచేసి డబ్బు కూడ బెట్టేవాడు. ఇలా ఉండగా 2006లో ఢిల్లీలో అన్ని చోట్ల మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ తనకు ఏదైనా పని దొరుకుతుందేమోనని భావించి మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కార్మికుల పిల్లలు భిక్షాటన చేయడం చూశాడు. పాఠశాలలకు ఎందుకు వెళ్లడం లేదని ఆ పిల్లలను ప్రశ్నించాడు. తమ తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేదని ఆ పిల్లలు చెప్పడంతో... అతని బాల్యం గుర్తొచ్చి మనసంతా కకలావికలం అయిపోయింది. (చదవండి: చూసి నవ్వడమే ఆ టీచర్‌కు శాపమైంది.. ప్రేమ, పెళ్లి అన్నాడు.. చివరకు)

వెంటనే కొన్ని పుస్తకాలు కొని తెచ్చి వారికి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఈ విషయం అందరికి తెలిసింది. దీంతో మరింత మంది పిల్లలు అతడి స్కూల్‌కి రావడానికి ఆసక్తి కనబర్చారు. అది అతనికి మరింత నూతన ఉత్సాహాన్నిచ్చింది. స్కూల్‌కి కావల్సిన కనీస అవసరాలైన బ్లాక్‌బోర్డు, బ్యానర్లు, బుక్స్‌, అన్ని అతని సొంత డబ్బులతోనే సమకూర్చుకున్నాడు. ప్రస్తుతం అతడు దాదాపు 300 మంది మురికివాడల పిల్లలకి ఉచితంగా ప్రాథమిక విద్యనందిస్తున్నాడు. తర్వాత వారిని ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తున్నాడు. (చదవండి: నా చావుకి వాళ్లే కారణమంటూ వీడియో రికార్డ్‌ చేసి..)

మా జీవితాలు మారిపోయాయి సార్‌!....
తన దగ్గర చదువుకున్న ఫ్లాట్‌ఫామ్‌ మీద బట్టలు అమ్ముకునే వ్యక్తి కొడుకు తనకు ఇంజీనీరింగ్‌ కాలేజ్‌లో సీటు వచ్చిందని చెప్పినప్పుడు తాను ఏడ్చేశానని చెప్పాడు సదరు గురువు. మీరు మా జీవితాల్ని మార్చేశారు సార్‌ అంటూ.. అతని పూర్వ విద్యార్థులు ప్రశంసిస్తుంటే తన కష్టం ఫలించనందుకు సంతృప్తిగా ఉందంటాడు. చిన్న చిన్న సాయాలు చేసి పేరు కోసం రకరకాలుగా పాకులాడుతుంటారు. కానీ ఈ ఢిల్లీవాసిలాంటి కొందరు సాధారణ మనుష్యులు సంపన్నుల కాకపోయిన తమ కష్టార్జితంతో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ.. అందరి హృదయాలను గెలుచుకుంటారు. ప్రస్తుతం ఇతడి స్టోరి తెగ వైరలవుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top