భద్రంగా కట్టుకోండి!

Central Nod For National Project Status For Upper Bhadra - Sakshi

కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయం 

కర్ణాటక జలదోపిడీకి సంపూర్ణ సహకారం ఇచ్చేలా కేంద్రం నిర్ణయాలు చేస్తోంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, అభ్యంతరాలను పట్టించుకోకుండా... ఏకపక్షంగా కొమ్ముకాస్తోంది. కేటాయింపులకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో కర్ణాటక ఎడాపెడా నీటిని తోడేస్తే... దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలున్నాయి.   

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర జలాల గరిష్ట నీటి వినియోగమే లక్ష్యంగా కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ చేసిన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌– 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వడ మే తప్పుగా పరిగణిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా జా తీయ హోదాకు సిఫారసు చేయడం తెలుగు రా ష్ట్రాలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్ర ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తుది ఆమోదంతో జాతీయ హోదా దక్క నుంది. ఈ లాంఛనం పూర్తయితే ప్రాజెక్టు వ్యయా న్ని కేంద్రమే భరిస్తుంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పూర్తయితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, దీన్ని కేం ద్రం విస్మరించడం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయడంపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాయనుంది.  

ఎగువనే నీటిని అడ్డుకునేలా... 
కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, ఆ నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించింది. తుంగభద్ర కు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని వరద కాల్వ ద్వారా కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల ని ల్వ సామర్థ్యాలను పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో దిగువకు వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయ ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కర్ణాటక విన డం లేదు. దీనిపై రాష్ట్రం.. కేంద్రానికి సైతం ఫిర్యా దు చేసింది. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ జాతీయ హోదాను ఇవ్వడం తెలంగాణకు మరింత మింగుడుపడని అంశంగా మారింది.  

ఎడాపెడా ఎత్తిపోతలు... 
నిజానికి అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్‌ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చు ట్టింది. తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఆపై భద్ర నుంచి 29.90 టీఎంసీలను ఎత్తిపోస్తూ.. చిక్‌మగళూర్, చిత్రదుర్గ, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల (బిందు సేద్యం) విధానంలో 2,25,515 హెక్టార్లకు నీళ్లందిస్తారు. ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో, భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్ల తో పూ ర్తిచేసింది.

మొత్తంగా రూ.4,800 కోట్ల మేర వ్య యం చేశాక 2018లో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అను మతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. అయి తే దీనిపై తెలంగాణ అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌–2లో అప్పర్‌ తుంగకు 11 టీఎంసీ, అప్పర్‌భద్ర కు 9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయి తే ఈ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదు. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్‌ భద్రను చేపట్టింది.  

దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే సీడబ్ల్యూసీ అనుమతించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు కూడా పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుతుంది.

దీనివల్ల తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ఆర్డీఎస్‌ ఆయకట్టు... 87,500 ఎకరాలు ప్రమాదంలో పడుతుంది. ఏపీలోని హెచ్చెల్సీ, కేసీ కెనాల్‌ల కింది ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడుతుం గభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండ దు. అదే జరిగితే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌కు వచ్చే వరద కూడా తగ్గనుంది. కాగా కాళేశ్వరం ప్రా జెక్టుకు జాతీయ హోదా అడిగినప్పుడల్లా ఆ విధానాన్నే పక్కనబెట్టామని చెబుతూ వస్తున్న కేంద్రం అప్పర్‌ భద్రకు హోదా ఇవ్వడంపై రాష్ట్ర నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top