Central Home Ministry Meeting On Division Of AP Bhavan Assets In Delhi - Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌ విభజన సమావేశం: తొమ్మిదేళ్లైనా కొలిక్కిరాని పంపకాలు

Apr 26 2023 9:36 AM | Updated on Apr 26 2023 11:28 AM

Central Home Ministry Meeting On Division Of AP Bhavan In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తో​ంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్‌ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. 

అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్‌ దాస్‌, రావత్‌, ‍ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్‌ ఉప్పల్‌ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్‌ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement