18 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేసిన సీఈసీ

CEC Rajeev Kumar treks 18 km to visit remote polling stations - Sakshi

ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచిన రాజీవ్‌ కుమార్‌

చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్‌ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్‌ గ్రామంలో ఈ పోలింగ్‌ స్టేషన్‌ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం.

ఈ పోలింగ్‌ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్‌ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top