ఇది తప్పనిసరి.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం | CBSE Mandates Three Language Rule for Classes 9 and 10 From July 1 | Sakshi
Sakshi News home page

ఇది తప్పనిసరి.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం

May 16 2026 4:49 PM | Updated on May 16 2026 5:10 PM

CBSE Mandates Three Language Rule for Classes 9 and 10 From July 1

ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్‌ఈ కల్పించింది.

సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్‌ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement