Three-language
-
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9,10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఎన్సీఈఆర్టీ( NCERT)కి నోటీసులు ఇచ్చింది.ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.అయితే, 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు.ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. -
కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరం
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు భిన్నంగా సీబీఎస్ఈ వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని 'ఎక్స్'లో పేర్కొన్నారు.పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయడం తగదని హితవు పలికారు. తక్కువ సమయంలోనే ఒక కొత్త భాషను నేర్చుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తే వారి చదువులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చెప్పినట్టుగానే 2029 నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు.''ఆరో తరగతి నుంచే విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని, వాటిలో రెండు భారతీయ భాషలు ఉండాలని ఏప్రిల్‌లో సీబీఎస్ఈ చేసిన ప్రకటనను స్వాగతించిన వారిలో నేనూ ఒకడిని. ఈ నిర్ణయం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే అనేక భాషలను నేర్చుకోవడానికి వీలవుతుంది. భారతదేశపు విభిన్న సాహిత్య ప్రపంచంపై వారి అవగాహనను విస్తృతం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మూడో భాషను 2029-30 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే తప్పనిసరి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.అయితే ఈనెల 15న తన అనుబంధ పాఠశాలలన్నింటికీ సీబీఎస్ఈ పంపిన ఉత్తర్వుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులు కొత్తగా మూడో భాషను నేర్చుకోవాలని ఆదేశించారు. దీని ప్రకారం జూలై 1 నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పసరిగా మూడు భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత స్వల్ప వ్యవధిలో కొత్త భాష నేర్చుకోవాలంటే ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీబీఎస్ఈ తాజాగా వెలువరించిన ఉత్తర్వులు తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తక్షణమే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. గత ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగానే 2029-30 విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతికి త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాన''ని అన్నామలై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఏమిటీ త్రిభాషా సూత్రం? జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమై, తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్ పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే -
ఇది తప్పనిసరి.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది.సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. -
త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. -
త్రిభాషా చిత్రంలో...
ఇది రానాకి సవాల్‌లాంటి సీజన్ అనాలి. ఎందుకంటే ఒకే సారి మూడు ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి: ది కన్క్లూజ్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఘాజి’ తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఆరంభం కానున్న ‘1945’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇప్పుడు ఏకంగా ఓ త్రిభాషా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మేజర్ రవి దర్శకత్వంలో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మేజర్ మహదేవన్ అనే పాత్ర చుట్టూ తిరిగే ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’, ‘కాందహార్’ వంటి వార్ మూవీస్ తీసిన మేజర్ రవి ఇప్పుడు ఇదే పాత్రతో తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత మూడు చిత్రాల్లోనూ మేజర్ మహదేవన్‌గా మోహన్‌లాల్ నటించారు. నాలుగో చిత్రంలోనూ ఈ పాత్రను ఆయనే చేయనున్నారు. మరో కీలక పాత్రకు రానాను తీసుకున్నారు. ఇందులో రానా లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపిస్తారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదలవుతుంది.


