కంగనాపై మరో కేసు

Case Against Kangana Ranaut For Allegedly Spreading Religious Disharmony - Sakshi

ముంబై :  మతపరమైన అసమ్మతిని సృష్టించేలా ట్వీట్లు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని పోలీసులును ముంబై కోర్టు ఆదేశించింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతరకర ట్వీట్​ చేశారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని అదేశించింది. 
(చదవండి : నేనూ బాలీవుడ్‌కి ఇచ్చాను!)

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్న సమయంలో ప్రజల్లో అనుమానాలు కలిగేలా వివాదస్పద వ్యాఖ్యలతోపాటు, ముంబైని పాక్‌ అక్రమిత కశ్మీర్‌గా పోలుస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కంగనా రనౌత్​ అభ్యంతరకర ట్వీట్​ చేసిందని ఓ వ్యక్తి​ కోర్టును ఆశ్రయించారు.  ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top