ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. బీజేపీకి 4 సీట్లు

Bypoll Results Updates: Counting Of 7 Assembly Seats in 6 States - Sakshi

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్‌జేడీ దక్కించుకున్నాయి. 

మునుగోడు(తెలంగాణ).. టీఆర్‌ఎస్‌

► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్‌ థాక్రే వర్గం)

► మొకామా(బిహార్‌).. ఆర్‌జేడీ 

► ధామ్‌నగర్‌(ఒరిశా).. బీజేపీ

► గోపాల్‌గంజ్‌(బిహార్‌)... బీజేపీ

► అదమ్‌పుర్‌(హరియాణా).. బీజేపీ

► గోలా గోక్రానాథ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌‌).. బిజేపీ

TIME: 3:45PM

►  ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్‌జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్‌ఎస్‌ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌, హరియాణాలోని అదమ్‌పుర్‌, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. 

TIME: 1:00PM

► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత  37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో  శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు.

►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

► మునుగోడు కౌంటింగ్‌ ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది. చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది.

►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి.

► హర్యానాలోని ఆదంపూర్‌ అసెం‍బ్లీ స్థానానికి కౌంటింగ్‌ కొనసాగుతోంది.  6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది.

TIME: 12:00PM
► అంధేరి తూర్పులో ఉద్ధవ్‌ ఠాక్రే  నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి.

► ఒడిశాలోని ధమ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్‌ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది.

TIME: 11:00AM

అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.  ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి.

► బిహార్‌ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

TIME: 10:00AM
బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్‌) స్థానాల్లో మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్‌ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది.

సాక్షి న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్‌, హరియాణాలోని ఆదంపూర్‌, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్‌నగర్‌తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7)
►మహారాష్ట్ర-తూర్పు అంధేరి
►బిహార్‌-మోకమ
►బిహార్‌-   గోపాల్‌గంజ్‌
►హరియాణ-అదంపూర్‌
►తెలంగాణ-మునుగోడు
►ఉత్తర్‌ప్రదేశ్‌- గోల గోకరన్నాథ్
►ఒడిశా- ధామ్‌నగర్‌

హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.

చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top