టెట్రిస్‌ గేమ్‌ను జయించిన బాలుడు  | Sakshi
Sakshi News home page

టెట్రిస్‌ గేమ్‌ను జయించిన బాలుడు

Published Fri, Jan 5 2024 9:22 AM

The Boy Who Conquered The Tetris Game - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్‌ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్‌ గేమ్‌ను 13 ఏళ్ల అమెరికన్‌ టీనేజర్‌ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్‌ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా..  చివరి 157వ లెవల్‌ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్‌ గిబ్సన్‌. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్‌ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్‌ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో గిబ్సన్‌ పోస్ట్‌చేశాడు. టెట్రిస్‌ గేమ్‌ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్‌’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట.

ఇవి చ‌ద‌వండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు!

Advertisement
 
Advertisement