బాల్యం నుంచి కొంతమందికి పోకీమాన్ కార్డులను సేకరించడం ఒక హాబీ. ఆ హాబీతోనే మలేషియాకు చెందిన పోకీమాన్ అభిమాని ఒకరు అరుదైన రికార్డ్ సృష్టించాడు. చిన్ననాటి అభిరుచి, కోట్ల ఆస్తిగా మారిన వైనం నెట్టింట విశేషంగానిలుస్తోంది.
ప్యాషన్ నుండి లెగసీ వరకు సాగిన ఈ ట్రేడింగ్ కార్డ్ సేకరణతో ఏకంగా (1.87 మిలియన్ల రింగెట్లు) రూ.3.8 కోట్లను సాధించాడు. మలేషియా పోకీమాన్ కార్డ్ ఔత్సాహికుడు షా ఆలంకి చెందిన డామిరల్ ఇమ్రాన్ సోషల్ మీడియాలో ఈ సేల్ గురించి ప్రకటించాడు. ప్యాషన్, హార్డ్ వర్క్ , లెగసీ స్టోరీ అంటూ తన విజయగాథను షేర్ చేశాడు. ప్రతీకార్డు, ప్రతీ బాక్స్, ప్రతీ నిద్రలేని రాత్రికి దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌లో ఒక రూమ్ అంతా పోకీమాన్ కార్డ్ బాక్స్‌లు నిండి ఉండటం గమనించ వచ్చు. ‘‘ ఇవి నా ప్రయాణంలో చాలా అద్భుతమైన క్షణాలు. ప్రతి కార్డు, ప్రతి పెట్టె, ప్రతి నిద్రలేని రాత్రి అన్నీ విలువైనవి. ఇది ముగింపు కాదు, గొప్ప ప్రారంభం మాత్రమే" అని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.NST నివేదిక ప్రకారం, కొనుగోలుదారు కూడా తోటి మలేషియాకు చెందిన వాడే.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) గ్లోబల్ కార్డ్ వాల్యుయేషన్ ట్రాకర్ అయిన షైనీ నుండి వచ్చిన డేటాను ఉటంకిస్తూ ఇమ్రాన్ కలెక్షన్ విలువ రెండు మిలియన్ల రింగెట్లకు పైగా ఉంటుందని నివేదించింది. ట్రేడింగ్ కార్డ్‌లను ప్రామాణీకరించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆథెంటికేటర్ (PSA) ద్వారా కార్డులు ధృవీకరించింది.
ఇదీ చదవండి: Saudi Arabia Sky Stadium: మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం
పోకీమాన్ కార్డులు
1996లో జపాన్‌లో మొదటిసారిగా ప్రారంభించిన పోకీమాన్ కార్డులు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, విలువైన ట్రేడింగ్ గేమ్స్ కార్డ్స్ గా అవతరించాయి. వాస్తవానికి పోకీమాన్ వీడియో గేమ్ సిరీస్‌తో పాటు వచ్చిన ఈ కార్డులు పిల్లల్లోనూ, సేకరించే వారిలోనూ చాలా కొద్ది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందాయి. గత కొన్ని దశాబ్దాలుగా బహుళ-బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ట్రేడింగ్ కార్డులు పాప్ సంస్కృతిలో విలువైన వస్తువులుగా మారిపోయాయి. ఇలాంటి అత్యంత అరుదైన కార్డులలో కొన్ని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేలంలో కోట్ల రూపాయలను దక్కించుకున్నాయి.


