రూ.50 లక్షల నష్ట​ పరిహారాన్ని ప్రకటించిన పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు

Both CMs In Punjab And Chhattisgarh Give ₹50 Lakh Exgratia For Lakhimpur Kheri Incident - Sakshi

నష్ల పరిహారం  ప్రకటించిన రెండు రాష్ట్రాలు

లక్నో: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలో జర్నలిస్ట్‌ కశ్యప్‌ తోపాటు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే  ఛత్తీస్‌గఢ్  ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్, ఎస్‌యూవీ వాహనంలోల ఒకదానిపై కూర్చుని నిరసనకారుల మీదకు  కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో బీజేపీ ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయి.

ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చన్నీ, బాఘేల్ ఇద్దరూ కూడా లక్నో పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉండగా... ఉత్తర ప్రభుత్వం కూడా చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు 45 ల‌క్ష‌ల ప‌రిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగం,  గాయపడిన వారికి రూ. 10 లక్షల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top