ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎక్సామ్స్‌.. | Board Exams To Be Conducted Twice A Year: NCF - Sakshi
Sakshi News home page

ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎక్సామ్స్‌.. కేంద్రం క్లారిటీ..

Aug 23 2023 5:18 PM | Updated on Aug 23 2023 6:10 PM

Board Exams Twice A Year - Sakshi

ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా బోర్డ్ ఎక్సామ్స్‌తో సహా పలు కీలక మార్పులు చేయనున్నారు. అందుకు అనుగుణంగా 2024 ఏడాదికి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం నూతన విధివిధానాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది.

పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకునేలా ప్రతి ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలను పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం విద్యార్థులు బాగా చదివిని సబ్జెక్టులనే ఎక్సామ్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మంచి మార్కులు వచ్చిన పరీక్షనే ఫైనల్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం తెచ్చుకునేలా ఈ విధానం ఉపయోగపడనుంది. 

ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు రెండు భాషలను అభ్యసించేలా కొత్త విధానాలను సిద్ధం చేశారు. ఇందులో ఒకటి తప్పకుండా భారతీయ భాష అయి ఉండాలని నిబంధనలు విధించారు. పాఠ్యపుస్తకాల ధరను తగ్గించాలని నొక్కి చెబుతూనే, తరగతి గదిలో పుస్తకాలను 'కవరింగ్' చేసే ప్రస్తుత పద్ధతిని నివారించవచ్చని కొత్త ఫ్రేమ్‌వర్క్ గుర్తించింది. 

ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement