అయ్యా సారూ.. మా ఎంపీ, ఎమ్మెల్యే మిస్సింగ్‌.. కనిపిస్తే చెప్పండి | BJP MP And MLA Missing Posters In West Bengal | Sakshi
Sakshi News home page

అయ్యా సారూ.. మా ఎంపీ, ఎమ్మెల్యే మిస్సింగ్‌.. కనిపిస్తే చెప్పండి

Apr 25 2022 11:17 AM | Updated on Apr 25 2022 11:20 AM

BJP MP And MLA Missing Posters In West Bengal - Sakshi

కోల్‌కత్తా: ఎన్నికల సందర్భంగా మీకు మేమున్నామంటూ ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచాక ప్రజాప్రతినిధులు మోహం చాటేస్తారు. దీంతో ప్రజలు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్బాలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 

తాము ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిథులు ఆపద వచ్చినప్పుడు అండగా నిలవకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రజలు, నేతలు మండిపడుతున్నారు. అయితే, ఇటీవలే అలీపూర్‌దువార్‌లో తుఫాన్‌ కారణంగా భారీ నష్టం జరిగింది.  ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తమను పరామర్శించలేదని ప్రజలు, రాజకీయ నేతలు మండిపడ్డారు. 

ఈ క్రమంలో స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన జాన్‌ బార్లా, ఫలకటా ఎమ్మెల్యే దీపక్‌ బర్మన్‌ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించారు. వెంటనే వారి ఆచూకి తెలపాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement