Karnataka BJP MLA Basanagouda Called Sonia Gandhi Vishkanya, Know Details Inside - Sakshi
Sakshi News home page

మోదీపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. సోనియా గాంధీ విషకన్య! బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

Apr 28 2023 2:45 PM | Updated on Apr 28 2023 4:30 PM

BJP MLA Basanagoud Called Sonia Gandhi vishkanya - Sakshi

కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాడివేడిగా రాజకీయ ప్రచారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీని విషసర్పం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్‌పై కౌంటర్‌ అటాక్‌ చేసే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధినేత్రి సోనియాగాంధీని విషకన్య! అని పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని ఆమోదించింది. ఒకప్పుడు అమెరికా ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ తదనంతరం అమెరికానే ఆయనకు రెడ్‌ కార్పేట్‌ పరిచి స్వాగతం పలికిందని ఆయన గుర్తు  చేశారు. అలాంటి గొప్ప నాయకుడిని విషసర్పంతో పోల్చుతున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు బసనగౌడ కొప్పల్‌ ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేపై ఫిర్యాదు దాఖలైంది. భారతీయ జనతా పార్టీ పాములాంటిదని.. మీరు దాని వద్ద చేరాలని ప్రయత్నిస్తే చనిపోతారని చెప్పానంటూ వెనక్కి తగ్గారు ఖర్గే. తాను మోదీని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఆ పార్టీ భావజాలం పాములాంటిదని చెప్పానే గానీ వ్యక్తిగత ప్రకటనలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారాయన. 

(చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూకడుతున్న జనాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement