యూపీలో భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు | Bhim Army chief Chandra Shekhar Azad shot at in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు

Jun 29 2023 6:20 AM | Updated on Jun 29 2023 3:44 PM

Bhim Army chief Chandra Shekhar Azad shot at in Uttar Pradesh - Sakshi

షహరాన్‌పూర్‌: ప్రముఖ దళిత నాయకుడు, భీమ్‌ ఆర్మీ అధినేత,  ఆజాద్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌(36)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ యన గాయపడ్డారు. ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షహరాన్‌పూర్‌ జిల్లాలోని దేవ్‌బంద్‌ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆజాద్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు బుధవారం చెప్పారు.

కారులో ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ కడుపులోకి ఓ తూటా దూసుకెళ్లిందని అన్నారు. దుండగులు ప్రయాణించిన వాహనంపై హరియాణా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఉందని వెల్లడించారు. వారిని గుర్తించి, అదుపులోకి తీసుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పుల ఘటన పట్ల ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement