షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..

Baby Born With Four Legs Madhya Pradesh Gwalior Pic Surfaces - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్‌ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్‌.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు.

శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు.
చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top