Ashok Gehlot Interesting Comments on Prashant Kishor - Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన అంటేనే ఓ బ్రాండ్‌..

Apr 20 2022 3:27 PM | Updated on Apr 20 2022 3:46 PM

Ashok Gehlot Interesting Comments On Prashant Kishore - Sakshi

జైపూర్‌: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్‌.. ప్రశాంత్‌ కిషోర్‌పై కీలక వ్యాఖ‍్యలు చేశారు. గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌శాంత్ కిశోర్ అంటేనే ఓ బ్రాండ్ అని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ప్రశాంత్‌ కిషోర్‌.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట న‌డిచార‌ని, ఆ త‌ర్వాత సీఎం నితీశ్‌ కుమార్‌తో కొంత కాలం ఉన్నారని అన్నారు. ఆ త‌ర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ వెంట న‌డిచార‌ని తెలిపారు. ఎన్నికల సమయంలో తాము కూడా ఏజెన్సీలు, విశ్లేష‌కుల నుంచి స‌ల‌హాలు తీసుకుంటామ‌న్నారు. ప్రశాంత్ కిషోర్ సేవలను, అనుభవాన్ని వినియోగించుకుంటామని అన్నారు. ప్ర‌శాంత్ కిశోర్ అనుభ‌వం ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఏకం చేయ‌డానికి ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని గెహ్లోత్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ బుధవారం ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన చింతన్ శిబిర్‌ కార్యక్రమంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇక, వచ్చే నెలలో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించనున్నట్టు గెహ్లాట్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement