పోలీసుకు తన ‘పవర్‌’ చూపాడు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే పవర్‌ కట్‌

Angry At Being Fined By Cop, UP Lineman Cuts Off Power Supply To Police Station - Sakshi

లక్నో: అధికారం ఉంది కదా అని ఎవరితోనైనా ఆటాడుకోవచ్చనుకుంటే ఏమవుతుంది.. ఒక్కోసారి అదే అధికారం రివర్స్‌ దాడి చేస్తుంది! ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇటీవల భగవాన్‌ స్వరూప్‌ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మోదీసింగ్‌ అనే పోలీసు అధికారి అతన్ని ఆపాడు. బండి కాగితాలు చూపాలని అడిగాడు. అయితే అత్యవసర పని మీద వెళ్తున్నందున కాగితాలు వెంట తెచ్చుకోవడం మరచిపోయానని స్వరూప్‌ బదులిచ్చాడు. కావాలంటే ఇంటికి వెళ్లి కాగితాలు తీసుకొచ్చి చూపుతానని బతిమిలాడాడు.

కానీ ఆపింది పోలీసు కదా.. అదేం కుదరదని తేల్చిచెప్పాడు. రూ. 500 జరిమానా కట్టాలంటూ చలాన్‌ వేశాడు. మోదీసింగ్‌ చర్యతో స్వరూప్‌ రగిలిపోయాడు. అసలే ‘కరెంటోడు’ కావడంతో పోలీ'సులకు తన స్టయిల్‌లో గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఇంకేముంది.. తన సహచర విద్యుత్‌ సిబ్బందితో కలసి వెళ్లి మోదీసింగ్‌ పనిచేసే హర్‌దాస్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు పవర్‌ కట్‌ చేసి పారేశాడు! ఎందుకిలా చేశావని.. మీడియా ప్రతినిధులు అడిగితే పోలీసుస్టేషన్‌ సిబ్బంది విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారని... అందుకే విద్యుత్‌ సరఫరా నిలిపివేశానని చెప్పుకొచ్చాడు.   
చదవండి: రెండో రోజు విచారణకు రాహుల్‌ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top