శశికళ విడుదల 27న ఖాయం

AMMK leader says sasikala will release on january 27 - Sakshi

శశికళ శిబిరం ధీమా 

ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి 

సాక్షి, చెన్నై: జనవరి 27న జైలు జీవితం నుంచి చిన్నమ్మ శశికళ బయటకు రావడం ఖాయం అని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ శిక్షా కాలం జనవరిలో ముగియనున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగానే విడుదల అవుతారన్న ప్రచారం సాగినా, అందుకు తగ్గ పరిస్థితులు కనిపించలేదు. తన ముందస్తు విడుదల విషయంగా శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. ఈ  పరిస్థితుల్లో చిన్నమ్మ ముందుస్తుగాకాదు అని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల కావడం తథ్యమని, ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు తాజాగా ధీమా వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. చదవండి: నో పార్టీ.. ఓన్లీ సేవ

మంగళవారం చిన్నమ్మ రాక గురించి చెన్నైలోని కార్యాలయంలో ఆ కళగం వర్గాలు సమావేశం కావడం, ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని ఆ కళగం నేత ఒకరు పేర్కొన్నారు. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లకు నిర్ణయించామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. మరో 28 రోజుల్లో చిన్నమ్మ బయటకు వస్తారని, ఇది జరిగి తీరుతుందని ఆ నేత ధీమా వ్యక్తంచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top