Ashok Gehlot: హోం మంత్రి మఫ్లర్‌ ఖరీదు రూ.80 వేలు

Amit Shah Muffler Costs RS 80000: Ashok Gehlot - Sakshi

జైపూర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వేసుకునే మఫ్లర్‌ ఖరీదు రూ.80 వేలు కాగా, కాషాయ పార్టీ నేతలు రూ.2.5 లక్షల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తున్నారని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో బీజేపీలో ఆందోళన మొదలైందన్నారు.

ప్రధాని, హోం మంత్రి, బీజేపీ నేతలు విధులను వదిలేసి, రాహుల్‌ గాంధీపై దాడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ రూ.41 వేల విదేశీ టీ షర్టు వేసుకున్నారన్న బీజేపీ వ్యాఖ్యలపై గహ్లోత్‌ ఈ మేరకు స్పందించారు. 

చదవండి: (భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top