అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం | Ambanibomb scare cas:NIA files charge sheet against Sachin Waze 9 others | Sakshi
Sakshi News home page

Ambani Bomb Scare Case: ఎన్‌ఐఏ కీలక చర్య

Sep 4 2021 9:33 AM | Updated on Sep 4 2021 1:36 PM

Ambanibomb scare cas:NIA files charge sheet against Sachin Waze 9 others - Sakshi

ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్‌సుఖ్‌ హిరాన్‌ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్‌ వాజే, ప్రదీప్‌ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది.

ఈ చార్జీషీటులో సచిన్‌ వేజ్, ప్రదీప్‌ శర్మ, వినాయక్‌ షిండే, నరేష్‌ గోర్, రియాజుద్దీన్‌ కాజీ, సునీల్‌ మానె, ఆనంద్‌ జాదవ్, సతీశ్‌ మోతుకూరి, మనీష్‌ సోని, సంతోష్‌ షెలార్‌ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్‌ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్‌ కాగా, కాజీ, మానెలను అరెస్ట్‌ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement