
తన భర్త హత్య కేసులో న్యాయం చేశారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిన ఓ మహిళా ఎమ్మెల్యేపై అఖిలేశ్ యాదవ్ బహిష్కరణ వేటు వేశారు. యూపీలో మాఫియా ఆగడాలపై యోగి ఆదిత్యనాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్‌ను మట్టుబెట్టిన యోగి సర్కార్ తనతో పాటు అనేక మంది మహిళా బాధితులకు న్యాయం చేసిందన్నారు.
‘అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047’పై జరిగిన చర్చలో పాల్గొన్న పూజా పాల్.. యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. నా భర్తను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. అతీక్ అహ్మద్ వంటి నేరగాళ్లపై అందరూ మౌనంగా ఉన్నప్పుడు అతడికి వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించా.
ఆ పోరాటంలో అలసిపోతున్న సమయంలో సీఎం యోగి నాకు న్యాయం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో నాలాంటి అనేక మంది మహిళలకు.. సీఎం న్యాయం చేశారు. అతీక్ వంటి నేరగాళ్లపై తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. రాష్ట్రం మొత్తం సీఎం యోగిపై పూర్తి విశ్వాసంతో ఉంది’’ అంటూ పూజా పాల్ పేర్కొన్నారు.