భారత్‌లో ఇరాన్‌ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్‌పీ నేత! | Akhilesh Yadav Financial Help To Iranian Couple | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇరాన్‌ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్‌పీ నేత!

Published Sat, Oct 28 2023 12:44 PM | Last Updated on Sat, Oct 28 2023 12:52 PM

Akhilesh Yadav Financial Help Iranian Couple - Sakshi

సైకిల్ యాత్రపై భారత్‌కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్‌పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌పారం ఎక్స్‌లో అఖిలేష్ యాదవ్‌ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని  అఖిలేష్‌ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు  అఖిలేష్‌ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement