ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త!

Airtel Users Now Access Calls and Data with Out SIM Card - Sakshi

ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. సిమ్ లేకుండా ఒక సారి ఫోన్ వాడటం గురుంచి ఆలోచించండి. అసలు అది సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఎయిర్‌టెల్ దాన్ని సుసాధ్యం చేస్తుంది. ఇప్పుడు సిమ్ లేకుండానే కాల్స్, సందేశాలు, మొబైల్ డేటాను వాడే టెక్నాలజీని తీసుకొచ్చింది. మీరు కనుక ఎయిర్‌టెల్ యూజర్ అయితే మీరు ఈ-సిమ్‌ను దగ్గరలోని ఎయిర్‌టెల్ స్టోర్ నుండి పొందవచ్చు. అలాగే, మీరు మీ ఫోన్‌లో ఎయిర్‌టెల్ ఈ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • మీరు ఎయిర్‌టెల్ ఈ-సిమ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, మీ సిమ్‌ను ఈ-సిమ్ గా మార్చడానికి సందేశం పంపాల్సి ఉంటుంది.
  • మీరు మొబైల్ నుంచి eSIMregistered email id అని టైపు చేసి 121కు పంపాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి సరైనది అయితే మీకు 121 నుంచి ఒక మెసేజ్  వస్తుంది. 
  • మీరు ఇచ్చిన ఈ మెయిల్ ఐడి సరైనది కాకపోతే మళ్లీ తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది.
  • మీరు 121 నుంచి వచ్చిన మెసేజ్ కు 60 సెకన్లలోపు '1' అని టైప్ చేసి ప్రత్యుత్తరం ఇవ్వాలని గుర్తుంచుకోండి.
  • ఇప్పుడు QR కోడ్ గురించి ఎయిర్‌టెల్ ఆఫీసర్ మిమ్మల్ని సంప్రదిస్తారు.
  • అన్ని వివరాలు సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్ లో అధికారిక QR కోడ్ వస్తుంది. 
  • మీరు QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత  ఈ-సిమ్ M 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.

చదవండి:

వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్! 

నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top