Chennai: ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా 1600 కి.మీ దూరం.. నవజాత శిశువుకు చికిత్స

Ailing Baby Airlifted To Chennai From Kolkata Treatment Goes On - Sakshi

విమానంలో చెన్నైకు శిశువు తరలింపు

ప్రత్యేక పర్యవేక్షణలో కరోనా నుంచి రక్షణ 

సాక్షి, చెన్నై: కోల్‌కతా నుంచి చెన్నైకు మూడు నెలల నవజాత శిశువును చికిత్స నిమిత్తం విమానంలో తరలించారు. ఎయిర్‌ లిఫ్ట్‌ ద్వారా 1600 కి.మీ దూరం పయనించి చెన్నై చేరుకున్న ఆ శిశువుకు రేలా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రేలా పీడియాట్రిక్‌ గ్యాస్ట్రో, కాలేయి నిపుణుడు డాక్టర్‌ నరేశ్‌ షణ్ముగం ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. రాంచికి చెందిన ఓ మహిళ నెలల తక్కువ కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చి కోవిడ్‌ –19 కారణంగా మరణించినట్టు తెలిపారు. తల్లితో పాటుగానే ఓ బిడ్డ మరణించగా, మరో శిశువును తీవ్ర చికిత్స ద్వారా వైద్యులు రక్షించినట్లు వివరించారు. అయితే, కరోనా ఇన్పెక్షన్‌ ఆ శిశువు(ఆషా)ను విడిచి పెట్టలేదని పేర్కొన్నారు.

రాంచీలోని ఓ ఆస్పత్రిలో ఆషాకు నెల రోజులుగా చికిత్స అందించారని చెప్పారు. ఆ తదుపరి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఊపిరితిత్తులు, ఉదర సంబంధిత చికిత్సలు సాగినా, చిన్నపేగు తొలగించినా, ఆ శిశువు ఇంటెన్సివ్‌ కేర్‌ పోషణకు పరిమితమైందని వివరించారు.  ప్రస్తుతం మూడు నెలల శిశువైన ఆషాకు పొత్తికడుపు వైఫల్యంతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నట్లు తెలిపారు. దీంతో చెన్నైకు రెండు రోజుల క్రితం ఆ శిశువును తరలించారని తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చామని తెలిపారు. తీవ్ర చికిత్స, ప్రత్యేక పర్యవేక్షణతో ప్రస్తుతం బిడ్డ సురక్షితం అని ధీమా వ్యక్తం చేశారు. నెమ్మదిగా పోషకాహారాన్ని స్వీకరిస్తున్నట్టు, శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. 

చదవండి: ఓవైపు కోటి నజరానా.. మరోవైపు వెయ్యి రూపాయల ధోతి, షర్టు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top