
48 గంటల్లో 769 కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మరణించినట్లు తెలియజేసింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా కరోనా వల్ల 65 మందికిపైగా మంది మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
