ప్రియాంక ​గాంధీల కుటుంబానికి చెందినది కాదు! ఆమె ఎందుకు అధ్యక్షురాలు కాకూడదు?

Abdul Khaleque Questioned Priyanka Vadra As Congress President?  - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్‌ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక వాద్ర ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్‌ ఎంపీ అబ్దుల్‌ ఖలేఖ్‌. హిందు సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఆమె వాద్రా కుంటుంబానికి చెందిన ఇంటి కోడలే గానీ గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు కదా అని ఖలేఖ్‌ అన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉ‍న్న ‍వ్యక్తి కూడా అని చెప్పారు. 

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పోటీ చేయమని కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అశోక్‌ గెహ్లాట్‌ కూడా రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండమని పలుమార్లు కోరారు. ఐతే రాహుల్‌ గాంధీ కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల గాంధీ కుటుంబంలోని వారెవ్వరూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండకూడదని నిర్ణయించకున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం శశిథరూర్‌ పోటీ చేస్తున్నట్లు తేలింది గానీ ఇంకా రాజస్తాన్‌ సంక్షోభం విషయమై అశోక్‌ గెహ్లాట్‌ పోటీ చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నామినేషన్‌ వేసేందుకు అక్టోబర్‌ 1 చివరి తేది కాగా, నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవడానికి  చివరి తేది అక్టోబర్‌ 8 . అంతేగాక అదే రోజు(అక్టోబర్‌ 8న) సాయంత్రం 5 గంటల ఫైనల్‌ లిస్ట్‌ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది పార్టీ.  అక్టోబర్‌ 19న ఫలితాలను వెల్లడిస్తారు.

(చదవండికాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగ్విజయ్‌ సింగ్‌?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top