ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి: ఆప్‌ ఎమ్మెల్యే

AAP MLA Pleads For President Rule In Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 395 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఢిల్లీలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇక్భాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయిందని, ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు.

‘ఢిల్లీలో కోనా పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. ప్రజలకు ఆక్సిజన్‌, ముందులు ఆందడం లేదు. నా స్నేహితుడే కరోనాతో పోరాడుతున్నాడు. అతనికి ఆసుపత్రిలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ దొరకడం లేదు. తనకు కావాల్సిన రెమెడిసివిర్‌ ప్రిస్కిప్షన్‌ నా దగ్గర ఉంది. కానీ నేను అది ఎక్కడి నుంచి తీసుకు రావాలి?. సాయం చేయలేక ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ప్రభుత్వం కూడా సహాయం చేయలేకపోతుంది.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. సీనియర్‌ వ్యక్తిని. అయినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఏ అధికారిని సంప్రదించలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలని అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరుతున్నారు. ఇదే గనుక జరగకపోతే రోడ్లపై శవాలు పడి ఉంటాయి’ అని విజ్ఙప్తి చేశారు. కాగా ఇక్బాల్‌ 1993 నుంచి ఢిల్లీలోని మాటియా మహల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్బాల్‌ కామెంట్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పందించలేదు.

చదవండి: ‘కరోనా కేసులు పెరగడానికి మేం కారణం కాదు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top