వారణాసిలో సీఎన్‌జీ బోట్లు

580 diesel boats converted to CNG in Varanasi to make Ganga pollution-free - Sakshi

వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్‌జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్‌కు బదులు సీఎన్‌జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు.

మరో 2వేల బోట్లను సీఎన్‌జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్‌ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్‌జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్‌జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top