చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు | 5 Policemen Suspended in Jharkhand After Extorting Money | Sakshi
Sakshi News home page

చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు

Jun 6 2021 9:03 PM | Updated on Jun 6 2021 9:03 PM

5 Policemen Suspended in Jharkhand After Extorting Money - Sakshi

రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసులను సస్పెండ్‌కు గురయ్యారు.  ఓ డ్రైవర్‌ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వారిని సస్పెండ్‌ చేసినట్లు సిమ్‌దేగా పోలీస్‌ సూపరింటెండెంట్ షామ్స్‌ తబ్రేజ్‌ ఆదివారం తెలిపారు. పోలీస్‌ శాఖ పరువు తీసే ఇటువంటి సంఘటనలను సహించమని ఎస్పీ అన్నారు.

మే 22న సోషల్‌ మీడియాలో వైరల్‌ మారిన ఈ వీడియోలో ఉన్నది ఈశ్వర్ మారండి, అనుజ్ కుమార్, ముఖేష్ కుమార్ మహతో, శివ్ ఒరాన్, అఖిలేష్ తిర్కీగా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు.  వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోన్నట్టు వెల్లడించారు.

(చదవండి: వైరల్‌: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్‌!)

Advertisement
 
Advertisement
Advertisement