1947, ఆగస్టు 15 నాటి పలు దిన పత్రికల హెడ్‌ లైన్స్‌ ఇవే..

1947 August 15th Daily Newspapers Headlines - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించి రేపటితో 75 ఏళ్లు. ఈ 75 ఏళ్లుగా మనం అనువభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.. స్వాతంత్ర్య సమర యోధుల వందల ఏళ్ల పోరాట ఫలం. లాఠీ దెబ్బలు.. బుల్లెట్‌ గాయాలు.. రక్తపుటేర్లు.. బంధిఖానాలు.. బలిదానాలు రవి అస్తమించని బ్రిటీష్‌ పాలనలో నిత్య కృత్యాలు. కశ్మీర్‌లో అన్యాయం జరిగితే కన్యాకుమారిలోని ఇంట్లో కూర్చుని తెలుసుకోవాటానికి.. అక్కడి నుంచే ప్రశ్నించటానికి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ లాంటి జెట్‌ స్పీడ్‌ సోషల్‌ మీడియా లేని రోజులవి. టీవీలు, రేడియోలు ఉన్నా.. సామాన్య ప్రజలకు అందుబాటులో లేవవి.

అలాంటి రోజుల్లో నిన్న ఏం జరిగిందో..రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవటానికి.. జాతిని ఏకం చేయటానికి.. ఉద్యమ వీరులకు, సామాన్య ప్రజలకు వారధులుగా నిలవటానికి వార్తా దిన పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించాయి. సుత్తి లేకుండా.. సూటిగా వార్తలను.. కాదు,కాదు సంఘటనలను జనాలకు అందించాయి. అలాంటి దినపత్రికలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఉదయం ప్రజల్ని ఎలా పలకరించాయి.. ఏఏ శీర్షికలు పెట్టాయంటే..

1947, ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా ఉన్న పలు దినపత్రికల్లోని హెడ్డింగ్స్‌...


ఫొటో క్రెడిట్‌: ఆంధ్రపత్రిక


ఫొటో క్రెడిట్‌ : మలయాళ మనోరమ


ఫొటో క్రెడిట్‌ : హిందుస్తాన్‌


ఫొటో క్రెడిట్‌ : గుజరాత్‌ సమాచార్‌


ఫొటో క్రెడిట్‌ : ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌


ఫొటో క్రెడిట్‌ : హిందూస్తాన్‌ టైమ్స్‌


ఫొటో క్రెడిట్‌ : టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా


ఫొటో క్రెడిట్‌ : ది హిందూ


కన్నడ పత్రిక 

ఫొటో క్రెడిట్‌ : ది ట్రిబ్యున్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top