ఉద్యోగి విధుల్లో ఉండ గా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కల్పించాలి. ప్రతినెలా ఐదో తేదీలోగా వేతనాలు, పెండింగ్ ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, ఈహెచ్‌ఎస్, ప్రమాద బీమా అమలు చేయాలి.
– డా.నర్సింగ్‌రావు,
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి, నారాయణపేట
ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తూ.. ప్రభు త్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమకు ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు, ఆరోగ్య బీమా వంటి కనీస ప్రయోజనాలు అందడం లేదు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి.
– డా.విరోజ, ఎంఎల్‌హెచ్‌పీ, చిన్నజట్రం సబ్ సెంటర్, నారాయణపేట మండలం
ప్రజల ఆరోగ్యమే ల క్ష్యంగా రెండు దశాబ్దాలుగా నిరంతరం సేవలందిస్తున్న జాతీయ ఆ రోగ్య మిషన్ ఉద్యోగుల జీవితాల్లో భరోసా కరువైంది. ఇన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉ ద్యోగాల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. ప్ర భుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యా యమైన డిమాండ్లను నెరవేర్చాలి. లేనిపక్షంలో వారికి మద్దతుగా ఉద్యమాలు చేపడుతాం.
– జి వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి


