అన్నదాత.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. ఆగమాగం

Oct 19 2026 1:19 AM | Updated on Oct 19 2026 1:19 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అనపోల తాయప్ప. కృష్ణా మండలం ఖానన్‌దొడ్డి స్వగ్రామం. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి చివరి దశలో ఉన్న వరి పంట మొత్తం నేలవాలింది. మళ్లీ వర్షం కురిస్తే నేలవాలిన కంకులకు మొలకలు వచ్చి పంట నాణ్యత దెబ్బతింటుందని భయాందోళనకు గురవుతున్నారు. తనతో పాటు గ్రామంలో సాగు చేసిన రైతుల వరి పంట సుమారు వందెకరాలకు పైగా నేలకొరిగిందని.. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులతో సతమతమవుతున్న తమను ప్రకృతి దెబ్బ పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు జైపాల్‌రెడ్డి. స్వ గ్రామం మాగనూరు. తన కున్న 5 ఎకరాల్లో వానాకాలం వరి సాగు చేశారు. శనివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, వర్షానికి వరి పంట నేలకొరిగింది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే దిగుబడి తగ్గగా.. గాలివాన దెబ్బతో మరింత నష్టం వాటిల్లనుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నేలవాలడంతో కన్నీరుమున్నీరవుతున్న రైతు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement