నారాయణపేట: నారాయణపేటతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న వంద లాది క్షత్రియ (ఖత్రి), స్వకున్శాలి సామాజికవర్గాల దసరా ఉత్సవాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. ఏటా పండుగను పురస్కరించుకొని మూడురోజుల పాటు నిర్వహించే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్ణాటకలోని అమీన్గఢ్, కేరూర్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పొట్టేళ్ల కొనుగోలు చేసి పండుగకు అమ్మవారికి బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది.
● క్షత్రియ, స్వకున్సాలి సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు దుర్గామాతను తమ ఇలవేల్పుగా భావిస్తూ ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు. కొందరు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టగా, మరికొందరు ఒంటిపూట భోజనం చేస్తూ నిష్టతో అమ్మవారిని ఆరాధిస్తారు. దుర్గాష్టమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంప్రదాయం ప్రకారం గొర్రె పొట్టేళ్లను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. సోమవారం బంధుమిత్రులకు మాంసాహార విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మంగళవారం విజయదశమి సందర్భంగా శమీపూజ నిర్వహించి పండుగ జరుపుకొంటారు.
దసరా వేళ అమ్మవారికి బలివ్వడం ప్రత్యేకం
పేటలో క్షత్రియ, స్వకున్సాలిసంప్రదాయం
మూడురోజుల పాటు వేడుకలు
అమ్మవారి ఆరాధనలో అనాదిగా వస్తున్న ఆచారం


