సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Oct 19 2026 1:19 AM | Updated on Oct 19 2026 1:19 AM

● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడులకలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్‌ పట్టణంలోని రాంలీలా మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి దంపతులు పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడి ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ అని, మహిళల ఐక్యత, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబమన్నారు. ఈ సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాకిటి మానస హన్మంతు, వైస్‌ చైర్‌పర్సన్‌ శైవీరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement