ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

నారాయణపేట: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని జాజాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ సంగీత అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గాంధీజీ విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామ వనరుల పటాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకొని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించడం, నీటిని పొదుపుగా వినియోగించడంపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాల్సిన సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేసి సక్రమంగా నిర్వహించేలా ప్రజలను చైతన్యపర్చాలని ఆదేశించారు. జాజాపూర్‌ ఇప్పటికే పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యా ఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అంశాల్లో ముందుందని అభినందించారు. అనంతరం నీటి సంరక్షణ, స్వచ్ఛత, బాల్య వివాహాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. జాజాపూర్‌ను బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా మ త్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్‌కుమార్‌, డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌ డ్‌, నోడల్‌ అధికారి యాదయ్య, ఎంపీఓ బాలాజీ, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement