గాంధీ జీవన విధానం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

గాంధీ జీవన విధానం ఆదర్శం

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

నారాయణపేట: మహాత్మాగాంధీ జీవన విధానం, ఆయన ఆచరించిన సత్యం, అహింస, సహనం, నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి వెలిగించి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. లక్ష్య సాధనలో గాంధీజీ ఎప్పుడూ సులభ మార్గాలను ఆశ్రయించకుండా సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని ఓర్పుతో పోరాడారని గుర్తు చేశారు. క్విట్‌ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ వంటి ఉద్యమాలు ఒక్కరోజులో విజయవంతం కాలేదని, నిరంతర కృషి, ప్రజలను చైతన్యపర్చిన ఫలితంగానే విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, జైలుశిక్షలు ఎదురైనా సిద్ధాంతాలను వీడకుండా పోరాటం కొనసాగించిన గాంధీజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలు, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్‌, కలెక్టరేట్‌ ఏఓ అనిల్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement