● విజయాలకు చిరునామా
● ఇంటిని నడిపిన చేతులే..
పాలన సాగిస్తున్నాయి
● అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న
ఆడబిడ్డలు
● నేడు జాతీయ కుమార్తెల దినోత్సవం
విశ్రాంత ఉపాధ్యాయుడైన తాత పర్యవేక్షణలో ఎలాంటి శిక్షణ లేకుండానే కష్టపడి చదివిన కొత్తపల్లి నందిని.. తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగం సాధించింది. గతంలోనే గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4లో ప్రతిభ చాటిన ఆమె.. తాజాగా గ్రూప్–1లో మల్టీజోనన్‌లో 152వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 281వ ర్యాంకు సాధించింది. కుమార్తె విజయం పట్ల తండ్రి, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘నాన్న కష్టాన్ని చూసి.. ఆయనకు గర్వంగా అనిపించేలా ఏదైనా సాధించాలనుకున్నా. ఈ విజయం మా కుటుంబం నాపై పెట్టుకున్న నమ్మకానికి ఫలితం’ అని నందిని భావోద్వేగంతో పేర్కొంది.
తల్లిదండ్రులతో నందిని
తాత పర్యవేక్షణ.. తండ్రి ప్రోత్సాహం...


