క్రమశిక్షణతో పెంచి పట్టుదలతో చదివిస్తే ఆడపిల్లలు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నిరూపించారు మక్తల్‌కు చెందిన విశ్రాంత పీఈటీ బి.గోపాలం, వెంకటమ్మ దంపతులు. వీరి నలుగురు కుమార్తెలు రూప, దీప, శిల్ప, పుష్ప ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తమ కాళ్లపై తాము నిలబడ్డారు. రూప పీఈటీగా, దీప ఉపాధ్యాయురాలిగా, శిల్ప వెటర్నరీ అసిస్టెంట్‌గా, పుష్ప పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కూతుళ్లను కొడుకులతో సమానంగా పెంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించామని గోపాలం తెలిపారు. నలుగురూ ఉద్యోగాలు సాధించడం మా జీవితంలో గొప్ప ఆనందమని పేర్కొన్నారు.


