మధ్యవర్తిత్వంతో కేసుల త్వరిత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంతో కేసుల త్వరిత పరిష్కారం

Sep 27 2026 1:22 AM | Updated on Sep 27 2026 1:22 AM

నారాయణపేట: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. శనివారం జిల్లా న్యాయస్థానంలోని కాన్ఫరెనన్స్‌ హాల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌, బార్‌ అసోసియేషన్‌న్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 90 రోజుల పాటు మీడియేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆరుగురు సీనియర్‌ న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారని.. వారి సమక్షంలో ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించి పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన కేసులకు చట్టబద్ధత ఉంటుందని, తక్కువ సమయంలో వివాదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌, చెక్‌ బౌన్‌న్స్‌, కుటుంబ, వివాహ, పిల్లల సంరక్షణ, మోటారు, ప్రమాద పరిహారం, కార్మిక, వినియోగదారుల వివాదాలకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు, కక్షిదారులు సహకరించాలని కోరారు. న్యాయవాదులు మధు, కుర్మన్నగౌడ్‌, భీంరెడ్డి, కృష్ణయ్యగౌడ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement