ధన్వాడ: కొనుగోలు చేసిన వరి విత్తనాల వివరాలు రైతుల వారీగా ఈ నెల 10లోగా సీడ్ సేల్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేధికలో ఫర్టిలైజర్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా కొండాపూర్ వ్యవసాయ క్షేత్రాలు సందర్శించి పంట ఎలా ఉంది అనే విషయలను పరిశీలించి రైతులకు పలు సూచనలు జేశారు. సర్వేయర్‌తో మాట్లాడి డిజిటర్ క్రాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఓ నవీన్‌కుమార్, ఏఈఓ సైమన్, భరద్వాజ్ తదితరులు ఉన్నారు.


