కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి రవాణా కాకుండా నివారించేందుకు స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారి ఎకై ్సజ్ చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్‌తో కలసి గురువారం కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు, సుంకేసుల వద్ద ఉన్న ఎకై ్సజ్ చెక్‌పోస్టులను ఆయన సందర్శించారు. వాహన తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. విజయవాడ నుంచి వచ్చిన ఎకై ్సజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆయా చెక్‌పోస్టులలో వాహన తనిఖీలు జరిగాయి. మద్యం అక్రమంగా తరలించే వారిపై కేసు నమోదు చేసి కట్టడికి చర్యలు తీసుకోవాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాహన తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని ఆయన సిబ్బందికి సూచనలు చేశారు. విశ్వేశ్వరరావు, మునిస్వామి, నవీన్, తదితరులు పంచలింగాల చెక్‌పోస్టులో విధులు నిర్వహించారు.


