కర్నూలు: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ బాలికను పోలీసులు చేరదీశారు. వివరాలు అడిగితే తండ్రి పేరు ఇర్ఫాన్, తన పేరు అశ్వినా అని, శ్రీచైతన్య పాఠశాలలో చదువుతున్నట్లు చెబుతోంది. గురువారం కర్నూలు ఎ.క్యాంప్‌లో ఉన్న పార్కు దగ్గర ఏడ్చుకుంటూ ఉండగా మూడో పట్టణ పోలీసులు చేరదీసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. నివాసం ఎక్కడుందని ప్రశ్నించినా.. చెప్పలేకపోతోంది. ప్రస్తుతం ఈ బాలిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంది. సమాచారం తెలిసినవారు సీఐ సెల్ 9121101061 నంబర్, అలాగే పోలీస్‌స్టేషన్ 08518–277187 నంబర్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.


