మనస్తాపంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువకుడి మృతి

Oct 23 2026 2:03 AM | Updated on Oct 23 2026 2:03 AM

జూపాడుబంగ్లా: ప్రేమ విఫలమవ్వటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేకుకొన్నాడు. ఈ ఘటన గురువారం తర్తూరు గ్రామంలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తెలుగు లీధర్‌(21) అనే యువకుడు ఆదే కాలనీకి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రేమించిన యువతి వివాహానికి అంగీకరించకపోవటం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లటంతో ఇంటివద్ద ఉన్న పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకొన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా ప్రాంతానికివెళ్లి వివరాలు సేకరించుకొన్నారు. మృతుని తల్లి తెలుగు గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement